![]() |
![]() |
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-24 లో..... తన తల్లి హాస్పిటల్ ఖర్చు ఎలా తీసుకొని రావాలని గంగ టెన్షన్ పడుతుంటే.. వీరు మనిషి వచ్చి ఇంజక్షన్ కి డబ్బు కడతాడు. అది చూసి ఇతనే నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిందని గంగకి చెప్తాడు పైడిరాజు. నేను మిమ్మల్ని మొదటిసారి చూసి ఇష్టపడ్డాను.. మీకు ఇష్టం అయితేనే ఈ పెళ్లి జరుగుతుంది.. మీ అమ్మ కిడ్నీ మార్చడానికి కూడా డబ్బు ఇస్తానని వీరు మనిషి చెప్పగానే మా అమ్మ కంటే ఏది ముఖ్యం కాదని, నాకు ఈ పెళ్లి ఇష్టమే అని గంగ అంటుంది. నా మీద ఒట్టేసి చెప్పమని పైడిరాజు అడుగగా.. గంగ ఒట్టేసి చెప్తుంది.
మరొకవైపు వీరుకి తన మనిషి ఫోన్ చేసి.. గంగ పెళ్లికి ఒప్పుకుందని చెప్తాడు. వీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకు అంత హ్యాపీ అని తన భార్య అడుగుతుంది. బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా పర్మిషన్ వచ్చిందని అంటాడు. ఏం బిజినెస్ అని తను అడుగుతుంది. అప్పుడే ఇషిక వచ్చి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అని కవర్ చేస్తుంది. ఇద్దరం కలిసి ప్లాన్ చేసామని ఇషిక అంటుంది. అవును తన సపోర్ట్ వల్లే సక్సెస్ అయ్యానని వీరు అంటాడు. మరొకవైపు గంగ పెళ్లి కూతురులాగా రెడీ అవుతుంది. తన ఫ్రెండ్స్ కి మా అమ్మ కోసమే ఈ పెళ్లి చేసుకుంటున్నానని చెప్తుంది. అది వాళ్ళ అమ్మ విని గంగ దగ్గరికి వెళ్లి ఎమోషనల్ అవుతుంది.
ఆ తర్వాత ఇందుమతి గంగ గురించి మాట్లాడుతుంటే శకుంతల వచ్చి.. భాను అను అంటుంది. వాళ్ళ అమ్మకి ఎలా ఉందో ఏంటో ఒకసారి వెళ్ళొస్తే బాగుండు అని శకుంతల అనగానే.. నేను వెళ్ళొస్తానని వీరు అంటాడు. అవసరం లేదు నేను వెళ్ళొస్తానని పెద్దసారు వంశీని తీసుకొని వెళ్తుంటాడు. అప్పుడే రుద్ర ఎదురు పడతాడు. అక్కడ ఏదైనా ప్రాబ్లమ్ అయితే వచ్చెయ్యండి అని రుద్ర చెప్తాడు. మరొకవైపు ఇప్పుడు ఈయన వెళ్తే అక్కడ గంగ గురించి తెలుస్తుందని వీరు, ఇషిక అనుకుంటారు. వీరు మనిషికి ఇషిక ఫోన్ చేసి అక్కడికి మా మావయ్య వస్తున్నాడు.. రాకుండా ఆపు అని చెప్తుంది. దాంతో పెద్దసారు ఇంట్లోకి వెళ్లకుండా రౌడీలు అడ్డకుంటారు అలాగే పైడిరాజు గొడవపడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |